జక్రాన్పల్లి, 20 ఆగస్టు 2025: మహబూబ్ నగర్లో జరగనున్న రాష్ట్ర అఖిలభారత ఐక్యా రైతు సంఘం (AIUKS) బహిరంగ సభను ఘనవిజయంగా చేయాలని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు హామీలను వెంటనే అమలు చేయాలని AIUKS డిమాండ్ చేసింది.
రైతులకు వరి, సన్నధాన్యాలకు ఇచ్చిన బొనస్ను తక్షణమే రైతుల ఖాతాల్లో జమ చేయాలని, సరిపడిన యూరియాను సబ్సిడీ ధరకు అందించాలని నేతలు తెలిపారు. ఈ సందర్భంగా జక్రాన్పల్లి మండల కేంద్రంలో సభా పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ డివిజన్ సంయుక్త మండలాల కార్యదర్శి బి. కిషన్, వ్యవసాయ సంఘం డివిజన్ కార్యదర్శి ఆల్గొట్ సాయిలు, దుంపేట గంగాధర్, దారం బలరాజ్, వి. బలయ్య, మోహన్ తదితరులు పాల్గొన్నారు.







