పదేళ్ల కేసీఆర్‌ పాలనలో వ్యవసాయం పండుగలా మారింది: హరీష్‌*.

On: Sunday, July 6, 2025 9:03 PM

 

పదేళ్ల కేసీఆర్‌ పాలనలో వ్యవసాయం పండుగలా మారిందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఉద్ఘాటించారు. కేసీఆర్‌ పాలనలోని పదేళ్లలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని చెప్పుకొచ్చారు. రైతు పక్షపాతిగా నిలిచిన కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. బీఆర్‌ఎస్‌ పాలనపై కాంగ్రెస్ నేతలు బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు నీటి విలువ తెలియడం లేదని హరీష్‌రావు విమర్శించారు.

కేసీఆర్‌పై కక్షతో రైతులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శిక్ష వేస్తున్నారని హరీష్‌రావు ఆరోపించారు. కన్నేపల్లి పంప్‌హౌస్‌ నుంచి నీరు తీసుకోవచ్చని.. కానీ రేవంత్ ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం స్విచ్‌ ఆఫ్‌ మోడ్‌లో ఉందని ఎద్దేవా చేశారు. మేడిగడ్డతో సంబంధం లేకుండా నీళ్లు తీసుకోవచ్చని అన్నారు. కాళేశ్వరం మోటార్లు ఆన్‌ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని కోరారు. లేకపోతే తామే కన్నేపల్లి వెళ్లి మోటార్లు ఆన్‌చేస్తామని హెచ్చరించారు. కేసీఆర్‌ ఆధ్వర్యంలో రైతులతో కలిసి వెళ్తామని హరీష్‌రావు పేర్కొన్నారు..

24 Jul 2025

Leave a Comment