ఎ9 న్యూస్ | మాసాయిపేట | డిసెంబర్ 14:
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయిపల్లి శివారులోని పులిగుట్ట తండాలో 30 ఏళ్ల అనంతరం ఎస్టీ ఏకలవ్య సంఘం నుంచి ఒక మహిళను గ్రామ సర్పంచిగా బలపరుస్తూ గ్రామస్తులు, తండావాసులు ఏకమయ్యారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవుల రాజిరెడ్డి నాయకత్వంలో పోషయ్య యాదవ్, బట్టి అంజా గౌడ్, విజయబాబు, బోనాల బాలు, బందెల చిన్న రత్నం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గ్రామస్తులు, తండావాసులు భారీ సంఖ్యలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ర్యాలీలు నిర్వహిస్తూ తమ మద్దతు ప్రకటించారు. మహిళా నాయకత్వానికి మద్దతుగా నిర్వహించిన ఈ ప్రచారం గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించిందని నాయకులు తెలిపారు.








