గజ్వేల్ తాసిల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు….

On: Saturday, March 7, 2026 8:49 PM

 

కరీంనగర్ జిల్లా:మార్చి 07

కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారులు శనివారం మెరుపు దాడి నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ తాసిల్దార్ శ్రావణ్ కుమార్,ఇంట్లో శనివారం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భారీగా నగదు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం విచారణ కొనసాగుతుంది…

 

ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో ఈ తనిఖీలు నిర్వహించారు. నగరంలోని మహారాజా బార్ అండ్ రెస్టారెంట్ వెనుక ఉన్న ఇంటితో పాటు.. ఆర్టీసీ కాలనీలో రెండు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

వీటితో పాటు శ్రావణ్ కుమార్ తండ్రి ఇంటి వద్ద లక్ష్మీ నగర్లోని సోదరి ఇంట్లో సైతం ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి.

07 Mar 2026

Leave a Comment