పెద్దపల్లి జిల్లా ….
పంచాయితీ రాజ్ ఎ.ఈ జగదీష్ బాబు రూ.90వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు….
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం వద్ద పంచాయతీరాజ్ ఏఈ జగదీష్ బాబు 90వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ డిఎస్పి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు..
కాల్వ శ్రీరాంపూర్ పంచాయతీరాజ్ ఏఈ జగదీష్ ఓదెల మండలం బాయమ్మపల్లి గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ రాజు నుండి సీసీ రోడ్డు బిల్లు మంజూరు కోసం 90వేల రూపాయలు డిమాండ్ చేసి తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.