ఆరోగ్యశ్రీ సేవలు ఆగస్టు 31 అర్ధరాత్రి నుంచి బంద్!

On: Friday, August 22, 2025 9:11 AM

 

ప్రకటన చేసిన సంస్థ:

తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (TANHA)

సేవలు నిలిపివేయబోయే స్కీములు:

ఆరోగ్యశ్రీ పథకం.

జర్నలిస్టుల హెల్త్ స్కీమ్.

ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్.

TANHA డిమాండ్లు:

1. రూ.1400 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి.

2. క్రమం తప్పకుండా చెల్లింపుల కోసం కమిటీ ఏర్పాటు చేయాలి.

3. ప్యాకేజీల సవరణ.

4. ఏకపక్ష సర్క్యులర్ల జారీని మానేయాలి.

5. చెల్లింపులపై స్పష్టత.

6. ఆరోగ్యశ్రీ vs ఇతర ఆరోగ్య పథకాల మధ్య సమన్వయం.

7. నూతన అవగాహన ఒప్పందం రూపొందించాలి.

8. సమస్యల పరిష్కారానికి యంత్రాంగం ఏర్పాటు చేయాలి

నేపథ్యం:

జనవరిలో ఒకసారి సేవలు నిలిపివేశారు.

ఆరోగ్య మంత్రి దామోదర్ రాజ్ నర్సింహతో చర్చల తర్వాత సమ్మె విరమించారు.

సమస్యలు ఇంకా పరిష్కారంలేకపోవడంతో మళ్లీ ఆందోళనకు దిగుతున్నారూ.

ప్రస్తుత స్థితి:

TANHA ప్రభుత్వాన్ని మరోసారి కోరుతోంది:

“ముఖ్యమంత్రి లేదా ఆరోగ్య మంత్రితో అత్యవసర భేటీ ఏర్పాటు చేయండి”

ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అంశం. ఈ సేవలపై ఆధారపడే రోగులు, పేషెంట్లు ముందుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం ఉత్తమం.

13 Mar 2026

Leave a Comment