ఆర్మూర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి నూగురు జ్యోతి నామినేషన్ దాఖలు…

On: Friday, January 30, 2026 6:00 PM

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్ పట్టణంలోని 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నూగురు జ్యోతి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 10వ వార్డు ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. నిరుపేదలు, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వార్డు పరిధిలో తాగునీరు, డ్రైనేజ్, రోడ్లు, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని పేర్కొన్నారు.

నామినేషన్ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని మద్దతు తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో గెలుపు సాధిస్తామని నూగురు జ్యోతి విశ్వాసం వ్యక్తం చేశారు.

04 Feb 2026

Leave a Comment