బడ్జెట్ అనేది ఒక దేశాన్ని గాని రాష్ట్రాన్ని గాని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఉ పయోగపడుతుంది, ప్రభుత్వాలు తాజా పరిస్థితిని మరియు భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ ను రూపొందించాలి, ఆదాయాలు ఖర్చులు సమానంగా ఉండేటట్లు మిగులు బడ్జెట్ లేదా సంతులిత బడ్జెట్ ని రూపొందించాలి, ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువైతే ఇది భావితరాలకు ప్రభావం చూపుతుంది, కాబట్టి ప్రభుత్వాలు మిగులు బడ్జెట్ లేదా సంతులిత బడ్జెట్ ని రూపొందించడానికి ప్రయత్నించాలి, భారత బడ్జెట్ అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం వచ్చే సంవత్సరానికి సంబంధించిన ఆదాయ ఖర్చుల యొక్క అంచనా వేసే ఆర్థిక ప్రకటన అని, ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1వ నుండి మార్చి 31వ తేదీ మధ్య కాలానికి సంబంధించిన రాష్ట్ర దేశ బడ్జెట్ ను తయారు చేయబడుతుంది, రాష్ట్ర బడ్జెట్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో దేశ బడ్జెట్ పార్లమెంటులో ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెడతారు, ఈ బడ్జెట్ మూడు రకాలుగా ఉంటుంది అవి సంతూలిత, లోటు మరియు మిగులు బడ్జెట్లుగా ఉంటాయి, ఆదాయం మరియు ఖర్చులు సమానంగా ఉన్నప్పుడు దానిని సంతులిత బడ్జెట్ అని, ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటే అది లోటు బడ్జెట్ అని, ఆదాయం కంటే ఖర్చులు తక్కువగా ఉంటే అది మిగులు బడ్జెట్ అని పిలుస్తారు, కాబట్టి ప్రభుత్వాలు మిగులు బడ్జెట్ లేదా సంతులిత బడ్జెట్ రూపొందించి ఆర్ధిక ప్రగతిని సాధించి దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి సాధించాలి, బడ్జెట్ వల్ల సమాజంలోని నిరుపేద వర్గాలను ఉద్దరించడం, ప్రాంతీయ అసమానతలను తగ్గించడం, రక్షణ సామర్థ్యాలను మెరుగుపరచడం, సరైన విద్యా సౌకర్యాలు కల్పించడం వంటి అనేక అంశాలను ప్రభుత్వలు దృష్టిలో ఉంచుకోవాలి. అందువల్ల ఆర్ధిక స్థిరత్వం, ఆర్థికవృద్ధికి ఏ ప్రభుత్వానికైనా మంచి ప్రణాళికతో కూడిన బడ్జెట్ చాలా అవసరం అని తెలిపారు…








