సానీక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో “పర్యావరణాన్ని కాపాడుకోవాలి” అనే సంకల్పంతో గ్లోబల్ గ్రీన్ రివల్యూషన్ మూవ్‌మెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ ప్రసాద్ రెడ్డి గారి స్టార్ X వారి సహకారంతో చిన్న శంకరంపేట్ మండలం, రామాయపల్లి గ్రామంలో 300 మొక్కలు నాటడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సానీక్ష ఫౌండేషన్ అధ్యక్షులు డి. శివ, సెక్రటరీ మహేష్, గ్రామ ప్రజలు మరియు స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచి, పచ్చదనం పెంపుకు అందరూ కట్టుబడి ఉండాలని నిర్వాహకులు తెలిపారు.







