ఆర్మూర్‌లో ఆదివాసి నాయకపోడ్ కులస్తుల ఆత్మీయ సమావేశం…,

On: Sunday, August 10, 2025 6:45 PM

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ గ్రామ శివారులో భీమన్న కళ్యాణ మండపంలో నిజామాబాద్ జిల్లా ఆదివాసి నాయకపోడ్ కులస్తుల ఆత్మీయ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడు బండారు భోజన్న, ఉద్యోగుల సేవా సంఘం సలహాదారుడు సాయన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా, మండల అధ్యక్షులు, కార్యదర్శులు, పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

భీమన్న దేవాలయంలో పూజలు, కొమురం భీం చిత్రపటానికి పూలమాలలర్పణ అనంతరం, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో కులస్తుల ఐక్యత, పేదలకు సహాయం, విదేశీ విద్యకు ప్రోత్సాహం, బెస్ట్ అవైలబుల్ స్కీం అవగాహన, మండలాల వారీగా చైతన్య కార్యక్రమాలపై పలు తీర్మానాలు చేశారు.

పూర్వ కుల పెద్దలను సన్మానించి, సహపంక్తి భోజనంతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో జిల్లా సేవా సంఘం అధ్యక్షుడు గాండ్ల రామచందర్, పుట్ట రాజేశ్వర్, కొసేడుగు రవి, కోండ్రు నవీన్, మూడో అశోక్ తదితరులు పాల్గొన్నారు.

14 Mar 2026

Leave a Comment