ఆలూర్ వేయినామాల శ్రీ వెంకటేశ్వర ఆలయ అభివృద్ధికి రూ.30 లక్షల నిధుల మంజూరుకు హామీ…

On: Sunday, January 18, 2026 2:14 PM

 

ఆలూర్ మండలంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న వేయినామాల శ్రీ వెంకటేశ్వర ఆలయ అభివృద్ధికి రూ.30 లక్షల నిధులు మంజూరు చేయనున్నట్లు హామీ లభించింది.

ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం ఆర్మూర్ మాజీ వైస్ ఎంపీపీ మోతె చిన్నారెడ్డి, ఆర్మూర్ మండలం యూత్ అధ్యక్షులు అగ్గు క్రాంతి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం రాజ్యసభ సభ్యుల నిధుల నుంచి రూ.30 లక్షలు మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఈ విషయంపై స్పందించిన జీవన్‌రెడ్డి, వెంటనే రాజ్యసభ సభ్యులు ఎంపీ సురేష్‌రెడ్డి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధులను త్వరలోనే మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, వేయినామాల శ్రీ వెంకటేశ్వర ఆలయం ఆలూర్ ప్రాంత ప్రజలకు ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రమని, దాని అభివృద్ధికి నిధుల మంజూరు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి చొరవ చూపిన మాజీ వైస్ ఎంపీపీ మోతె చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిలకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బార్ల గణపతి, సింగిడి మోహన్‌రెడ్డి, మోతె నారాయణ, దుగ్గి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

05 Feb 2026

Leave a Comment