A9 న్యూస్ ప్రతినిధి – ఆర్మూర్:
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ అయిన సుంకేట్ గ్రామానికి చెందిన కైరి నరేష్ (39) మద్యానికి బానిసై తన ప్రాణాలను కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్థానికుల కథనం ప్రకారం, నరేష్ తన భార్యతో తరచూ గొడవలు పడుతుండేవాడు. కుటుంబ కలహాల మధ్య సుంకేట్ గ్రామం నుండి పతేపూర్ గ్రామంలో కూలీగా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. అయితే పాణం అలవాటు తీవ్రస్థాయికి చేరడంతో జీవితంపై విరక్తి చెందాడు.
ఈ నేపథ్యంలో, పెర్కిట్ గ్రామ శివారులో గులకల మందు తాగి ఉత్పత్తి చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనస్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మృతుడి తల్లి కైరి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.







