చిన్న శంకరంపేట్ మండలం, చందాపూర్ గ్రామానికి చెందిన వడ్ల సాయి ప్రసాద్ నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అప్పటి నుండి బెడ్ రెస్ట్‌లో ఉన్నాడు. ఈ సందర్భంలో సానిక్ష ఫౌండేషన్ సభ్యులు శివ గారు, నాని గౌడ్ గారు, మరియు మౌనిక గారు సాయి ప్రసాద్ గారిని పరామర్శించి, ఆయన కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సేవా కార్యక్రమం స్థానికంగా అందరి ప్రశంసలు పొందింది.







