గంగాసముందర్ సర్పంచ్ బరిలో శ్రీరామ్ సుజాత మహిపాల్…
గంగాసముందర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో శ్రీరామ్ సుజాత మహిపాల్ కత్తెర గుర్తుతో బలంగా బరిలో నిలిచారు. ప్రజల మధ్య నుంచే ఎదిగి, గ్రామ సమస్యలపై పట్టు ఉన్న అభ్యర్థిగా గ్రామమంతా విశ్వాసం సంపాదించారు. మాటలకే పరిమితం కాకుండా పనిచేసే నాయకత్వం అందిస్తానని గట్టిగా ప్రకటించారు.
గ్రామంలో విద్య, వైద్యం వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రభుత్వ పెన్షన్లు, రేషన్ కార్డులు అర్హులైన ప్రతి కుటుంబానికి ఒక్కరూ మిస్ కాకుండా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. పేదలు, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా గ్రామంలోనే సమస్యలకు పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు.
అభివృద్ధి పనుల్లో అవినీతికి తావులేకుండా పారదర్శక పాలన, ప్రతి రూపాయి గ్రామాభివృద్ధికే వినియోగించే దృఢ సంకల్పం తనదని తెలిపారు. అన్ని వర్గాలను కలుపుకొని ఐక్యతతో గంగాసముందర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ధీమా వ్యక్తం చేశారు.
గ్రామ భవిష్యత్తు, నిజమైన మార్పు కోసం కత్తెర గుర్తుకు ఓటు వేసి శ్రీరామ్ సుజాత మహిపాల్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని గంగాసముందర్ గ్రామ ప్రజలను గట్టిగా విజ్ఞప్తి చేశారు.







