21వ వార్డులో మార్పుకు నాంది – ప్రజల ముందుకు బొల్లం అనూష…..

On: Monday, February 9, 2026 10:52 AM

 

21వ వార్డును అభివృద్ధి పథంలో నడిపించాలనే సంకల్పంతో శ్రీ బొల్లం అనూష (M.Com) – అరుణ్ (M.A) కౌన్సిలర్ అభ్యర్థిగా ప్రజల ముందుకు వచ్చారు.

విద్యావంతురాలిగా, సామాజిక బాధ్యతతో, వార్డులోని ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ప్రజల ఆశీర్వాదం కోరుతున్నారు.

స్వచ్ఛమైన తాగునీరు, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ, గుంతలేని సీసీ రోడ్లు, మహిళల భద్రతకు సీసీ కెమెరాలు, ప్రతి వీధిలో LED లైట్ల ఏర్పాటు వంటి అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు, పెన్షన్లు అందేలా కృషి చేస్తామని తెలిపారు.

ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే విధంగా వార్డులో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసి, ప్రతి నెల “ప్రజాదర్భార్” నిర్వహించి సమస్యలను నేరుగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

“అధికారం కోసం కాదు, ప్రజల సేవ కోసమే పోటీ చేస్తున్నాను” అని చెప్పిన బొల్లం అనూషకు వార్డు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

10 Feb 2026

Leave a Comment