హైదరాబాద్:డిసెంబర్ 06
ఆధునిక భారతదేశ చరిత్రలో అంబేడ్కర్‌కు అత్యంత ప్రాముఖ్యం ఉంది. దేశ జనాభాలో పది శాతం ఉన్న అగ్రవర్ణాల వారు, తొంభైశాతం ఉన్న అణగారిన వర్గాల ప్రజల మెదళ్లకు బానిస సంకెళ్లు వేసి తరతరాలుగా వారితో వెట్టిచాకిరీ చేయించుకున్నా రు. స్వాతంత్ర్యానంతరం ఇలాంటి పరిస్థితులను రూపుమాపి, దేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులను సరిసమానం చేసేందుకు కృషి చేసిన వ్యక్తి డా. బీఆర్ అంబేడ్కర్. వర్ధంతి నేడు….
దళిత కుటుంబంలో జన్మించి, ఎన్నో కష్టాలు పడి, పోరాటాలు, త్యాగాలు చేసి భారత రాజ్యాంగం అనే గ్రంథాన్ని రచించిన ఒక విశిష్ట సంఘ సంస్కర్త’గా మాత్రమే నేటి పాలకులు అంబేడ్కర్‌ను పరిమితం చేశారు.కానీ, అణగారిన వర్గాలకు ఏ లక్ష్యాలను సాధించుకో వాలని చెప్పాడో వాటిని నేటి పాఠ్యాంశాల్లో చేర్చకపోవడం దేశ అగ్రవర్ణ పాలకుల స్వార్థబుద్ధికి నిదర్శనం.
వారు అంబేడ్కర్ స్థాయిని ఉద్దేశపూర్వకంగానే తగ్గించి రాశారు. ఆ చరిత్రే నిజమని నేడు ఎందరో విద్యావం తులు, మేధావులూ నమ్ము తుండడం విచారకరం. అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాత, గొప్ప సంఘ సంస్కర్త మాత్రమే కాదు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, ఉచిత స్కాలర్ షిప్‌లు, రిజర్వేషన్లు అంత కంటే కాదు. అంబేడ్కర్ సమాన త్వాన్ని కాంక్షించారు.
జనాభాలో పదిశాతం ఉన్న అగ్రవర్ణాలకు, తొంభైశాతం ఉన్న అణగారిన వర్గాలకు మధ్య ఒక స్పష్టమైన సైద్ధాంతిక గీత గీశారు. అసమానతలను పెంచి పోషించాలనుకునే అగ్రవర్ణ సమాజానికి– సమస మాజం, ప్రజాస్వామ్య, గణతంత్ర విలువలు కావాలనుకునే అణగారిన సమాజానికి మధ్య ‘సామాజిక రాజకీయ సాంస్కృతిక’ భావజాల పోరాటం చేశారు.
భారత ప్రజలందరి మధ్యా ‘స్వేచ్ఛ, సమానత్వం, సోద రభావం, ప్రజాస్వామ్య, గణతంత్ర’ భావాలు విరజిల్లాలని కలలుగని, ఆయా అంశాలను రాజ్యాం గంలో పొందుపరిచాడు. ఒకపక్క బ్రిటిష్ పాలకులపై రాజీపడని స్వాతంత్ర్య పోరాటం సాగిస్తూనే, మరోపక్క నాటి అగ్రవర్ణ నాయకులతోనూ అంతే స్థాయిలో తీవ్ర పోరాటం చేశాడు.
స్వాతంత్ర్యానంతరం అగ్రవర్ణాల వారే పాలకులై, అణగారిన వర్గాలను బానిసలుగా మార్చకూడని భావించాడు. అంబేడ్కర్ అంతటి విశాల భావాలు ఉన్నవాడు కాబట్టే ఆయన జయంతిని జ్ఞాన దినోత్స వంగా జరుపుకుంటున్నాం.
. జై భీమ్✊.







