
ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణానికి చెందిన ఎంఎన్ఆర్ స్టూడెంట్స్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్ కు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ డిచ్పల్లి శారద దినీష్ ను ప్రత్యేకంగా సన్మానించారు.
ఈ సన్మాన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యుడు మల్యాల నర్సారెడ్డి పాల్గొని, కౌన్సిలర్ సేవలను ప్రశంసిస్తూ శాలువాతో సత్కరించారు. పట్టణ అభివృద్ధి, ప్రజాసేవలో కౌన్సిలర్లు పోషిస్తున్న పాత్ర అభినందనీయమని యూత్ క్లబ్ సభ్యులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంఎన్ఆర్ స్టూడెంట్స్ యూత్ క్లబ్ సభ్యులు, పట్టణ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.








