6మహిళా సంక్షేమానికి పెద్దపీట….
ఆర్మూర్, ఆలూర్ మండలం:
దేగాం గ్రామంలో మహిళాసంఘం సభ్యులు, సి.ఏ.లు మరియు సి.సి. కల్పన ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా సర్పంచ్, ఉపసర్పంచ్‌లుగా ఎన్నికైన ఇట్టడి లింగారెడ్డి ధర్మపురి లకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ఇట్టడి లింగారెడ్డి మాట్లాడుతూ, గ్రామంలోని మహిళలకు ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో చేరేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహిళల అభివృద్ధే గ్రామాభివృద్ధి అని పేర్కొంటూ, మహిళా భవన నిర్మాణానికి స్థానిక నాయకుల సహకారంతో చర్యలు తీసుకుంటానని, మహిళల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సి.సి. కల్పన, సి.ఏ.లు జ్యోతి, నిశితతో పాటు గ్రామ మహిళాసంఘం కార్యవర్గ సభ్యురాళ్లు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.








