బీసీ గురుకుల విద్యార్థి ఘనత… రాష్ట్రానికి గర్వకారణం…

On: Monday, January 26, 2026 7:44 PM

 

5634 మీటర్ల పర్వతాన్ని అధిరోహించిన నూత్ పల్లి లింబాద్రీ..

ఆర్మూర్, డొంకేశ్వర్ మండలం:

నూత్ పల్లి గ్రామ బీసీ గురుకులంలో 10వ తరగతి చదువుతున్న మాలావత్ లింబాద్రీ అసాధారణ సాహసాన్ని ప్రదర్శించి తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచాడు. తెలంగాణ రాష్ట్ర నంది రాక్ క్లైంబింగ్‌కు ఎంపికై, నేపాల్‌లో నిర్వహించనున్న అంతర్జాతీయ మౌంటెనీరింగ్ బేస్‌క్యాంప్ కార్యక్రమానికి అర్హత సాధించిన లింబాద్రీ, 5634 మీటర్ల ఎత్తుగల పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించి తన సత్తా చాటాడు.

గ్రామీణ ప్రాంతానికి చెందిన బీసీ గురుకుల విద్యార్థి ఇంతటి ఘనత సాధించడం రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది. కఠిన శిక్షణ, అపారమైన ధైర్యం, క్రమశిక్షణతో ఈ విజయాన్ని సాధించిన లింబాద్రీ యువతకు ఆదర్శంగా నిలిచాడు. ఈ విజయం విద్యతో పాటు క్రీడలు, సాహస క్రీడల్లో కూడా బీసీ గురుకులాల ప్రతిభను చాటుతున్నదని పలువురు అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాజారెడ్డి బీసీ గురుకుల ప్రిన్సిపాల్ ఎం. లక్ష్మీ గౌడ్, ఎటిఏ కృష్ణవేణి, సీడీ గుడికందుల ప్రదీప్ తదితరులు విద్యార్థిని ఘనంగా అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

04 Feb 2026

Leave a Comment