. మాకు భూమిపై సంబంధంలేని వ్యక్తి చదును చేయడం ఏంటి
A9 న్యూస్ ఆర్మూర్:
డొంకేశ్వరం మండలం పరిధిలోని నికల్పూరు గ్రామంలో 12 కులాలు 40 కుటుంబాలకు చెందిన పురాతన భూమిని ఆ ఊరితో సంబంధం లేని వ్యక్తి ధరణిని అడ్డం పెట్టుకొని కబ్జా చేయడమే కాకుండా కోర్టు నుండి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుని వచ్చి తమ భూమిని లాక్కునే ప్రయత్నం చేశాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చెయ్యడం జరిగింది. భూమిని ట్రాక్టర్ సహాయంతో చదును చేయడానికి ప్రయత్నం చేయగా గ్రామస్తులు అడ్డుకోవడం జరిగింది .వివరాలలోకి వెళితే పోచంపాడు ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా తమ గ్రామం ముంపునకు గురవుతుందని అధికారులు తమ ఊరిని వదిలిపెట్టి ఇంకోచోటకు వెళ్లాలని సూచించడంతో తమ భూమిని అక్కడే వదిలేసి వేరే ప్రాంతానికి వలస వెళ్లడం జరిగింది. వదిలి వచ్చిన భూమికి ప్రభుత్వం నుండి నష్టపరిహారం కూడా రావడం జరిగిందని, కానీ ఈ భూమిపై కన్నేసిన కె. వెంకటేశ్వర్ రావు అనే వ్యక్తి గత ప్రభుత్వం హయాంలో ధరణి సహాయంతో పట్టా చేయించుకుని కోర్టు నుండి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని వచ్చి భూమిని చదును చేయడం ఏంటని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ భూమిలోనే గ్రామానికి సంబంధించిన పశువులు పడుకోవడానికి వదిలేసామని అలాంటి భూమిని కబ్జా చేస్తే తమ పశుపక్షాదులు ఎక్కడ ఉండాలో ప్రభుత్వ అధికారులే తెలపాలని సూచించారు .అక్రమంగా ధరణి అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా చేసుకున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బాధితులు మారుతి, రాజన్న, లంబడి తలసారం, శేఖర్ రెడ్డి దయానంద్ , గంగారం, సాయన్న, ఐల ఫకీరయ్య, గొల్ల భూషణ్ తదితరులు పాల్గొన్నారు.