లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ అవినీతి పోలీసు అధికారి….

On: Wednesday, November 12, 2025 11:21 AM

 

ములుగు జిల్లా:నవంబర్ 12

లంచం తీసుకుంటున్న ఎస్ఐ,కానిస్టేబుల్ ను ఏసీబీ అధికారులు మంగళ వారం రాత్రి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇంటికి సంబంధించి బాధితుల నుంచి రూ. 50వేలు లంచం తీసుకుంటూ సిద్దిపేట జిల్లా ములుగు ఎస్సై విజయ్‌ కుమార్‌, కానిస్టేబుల్‌ రాజు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

ఉమ్మడి మెదక్‌ జిల్లా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌ తెలిపిన వివరాల ప్రకారం… సిద్దిపేట జిల్లా ములుగు మండలం లోని ఓ గ్రామానికి చెందిన మహిళకు ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇంటిని కేటాయించింది.ఆ ఇంటిని మరొకరు కబ్జా చేయగా బాధితురాలు కోర్టును ఆశ్రయించింది.

ఆమెకు అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు జారీ చేయగా కబ్జా చేసిన వారి నుండి ఇల్లు ఖాళీ చేయించేందుకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని ఓ వ్యక్తి ఈనెల 5వ తేదీన ఎస్సై విజయ్ కుమార్ కు ఫిర్యాదు చేశాడు.ప్రొటెక్షన్ ఇచ్చేందుకు మా వద్ద సరిపడా సిబ్బంది లేదని ఫిర్యాదుదారున్ని ఇబ్బంది పెట్టాడుఎస్సై

కబ్జాదారుల నుంచి ఇంటిని బాధితురాలికి అప్పగించేం దుకు ఎస్సై రూ.లక్ష డిమాండ్‌ చేయగా రూ. 50వేలకు అంగీకరించారు. మంగళవారం రాత్రి బాధితులు రూ. 50 వేలు కానిస్టేబుల్‌ రాజు ద్వారా ఎస్సైకి అందిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

12 Mar 2026

Leave a Comment