ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం..

On: Thursday, September 25, 2025 11:33 AM

 

హైదరాబాద్, సెప్టెంబర్ 25: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమాశ్రయంలో ఇండిగో విమానానికి (6E-816) పెను ప్రమాదం తప్పింది. ఈరోజు (గురువారం) ఉదయం జైపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా ఫ్లైట్‌ను ఓ పక్షి ఢీకొట్టింది. వెంటనే అప్రమత్తమైన పైలెట్ ఎంతో సమయస్పూర్తితో వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో విమానంలో మొత్తం 162 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎంతో సురక్షితంగా విమానం ల్యాండ్ అవడంతో అటు ప్రయాణికులతో పాటు ఎయిర్‌పోర్ట్ అధికారులు కూడా ఊపిరిపీల్చుకున్నారు..

25 Sep 2025

Leave a Comment