Monday, November 25, 2024

నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం MRO కార్యాలయం లో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్మ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించిన నమూనా చిహ్నం(రాజముద్ర) ఆమోదించమని అదనపు తహసీల్దార్ వసంత్ రావుకు విజ్ఞాపనపత్రం అందజేత

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

తెలంగాణ ప్రభుత్వ చిహ్నం పై …

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని మారుస్తూ, ఆ స్థానంలో కొత్త చిహ్నం తీసుకురావాలని ప్రకటించడాన్ని గమనించాం, దీన్ని మేమూ స్వాగతిస్తున్నాము.

వివిధ పార్టీల నుండి, సంస్థల నుండి కూడా ప్రతిపాదనలు తమ ప్రభుత్వం స్వీకరిస్తుందని తెలుసుకున్నాం. అందులో భాగంగానే ధర్మ సమాజ్ పార్టీ నుండి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చిహ్నాన్ని ప్రతిపాదిస్తున్నాం.
మేము ప్రతిపాదిస్తున్న ఈ చిహ్నంలో ని గొప్పతనం ఏమిటంటే.. ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన ఉస్మానియా యూనివర్సిటీ ని మరియు దాని నుండి గౌరవ డాక్టరేట్ తీసుకున్న భారత రాజ్యాంగ నిర్మాత డా. అంబేడ్కర్ ని ఈ చిహ్నంలో ఉంచాము. ఇది మన తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ ఎంతో గంభీరమైన విషయం మరియు అగ్రవర్ణ భూస్వామ్య పాలకవర్గం పై అణగారిన వర్గాల రాజ్యం కోసం, హక్కుల కోసం యుద్ధం చేసిన పండగ సాయన్న, సర్దార్ సర్వాయి పాపన్న, సమ్మక్క సారలక్కల చిత్రాలను కూడా ఈ తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదిత చిహ్నం లో ఉంచాము.
ఈ ప్రతిపాదిత చిహ్నంలో ఉంచిన ఈ ఆరు చిత్రాలు సమాజంలో సమానత్వ భావనని, పీడిత వర్గాల యోధుల పోరాట స్ఫూర్తి కనిపిస్తుంది, కావున (తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు) ధర్మ సమాజ్ పార్టీగా మేము ప్రతిపాదిస్తున్నాం. తప్పకుండా దీనిని ఆమోదించి మీకు మీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల పట్ల సమానత్వ భావన ఉందని… తెలియ జేయండి.

ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ మండల నాయకులు శ్రీకాంత్, అనిల్, నరేష్, మనోజ్, భూమేష్, భాస్కర్ తదితరులు పాల్గొనడం జరిగింది.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here