జక్రాన్ పల్లి మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో క్రీడాకారులకి స్పోర్ట్స్ దుస్తులు అందజేసిన నిజామాబాద్ రూరల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సోప్పరి వినోద్, మాజీ సర్పంచ్ బాల కిషన్ చంద్రకళ,కాటిపల్లి నర్సారెడ్డి, వాలీబాల్ సీనియర్ క్రీడాకారుడు చిట్ల
శ్యామ్,ఉపాధ్యాయుడు రఘు, ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ నెల జరగబోయే మండల స్థాయి క్రీడలకు గాను దుస్తులను అందించడం జరిగిందని, జరగబోయే క్రీడలలో ముందంజలో ఉండి జక్రాన్ పల్లి పాఠశాల ప్రతిభని కనపరిచి క్రీడాకారులు విజయం సాధించాలని వారు కోరారు, ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు లింగన్న,మైనారిటీ మండల అధ్యక్షుడు సైకిల్ టెక్స్ట్ అక్బర్, వైస్ వైఏ యూత్ అధ్యక్షుడు బొంబాయి మహేందర్ మరియు సీనియర్ క్రీడాకారుడు వ్యాయమా ఉపాధ్యాయుడు రంజిత్, రవి కుమార్, సోప్పరి వెంకటేష్,సోషల్ మీడియా మండల అధ్యక్షుడు నట్ట తిరుపతి మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.







