A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని వాడి గ్రామంలో వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు ముదిరాజ్ మండల కమిటీ అండగా నిలిచింది. మండల కమిటీ పిలుపు మేరకు మానవతా దృక్పథంతో ముందుకొచ్చిన ముదిరాజ్ సంఘ సభ్యులు గ్రామంలో 161 కుటుంబాలకు బియ్యం, పప్పులు, నూనె, కారం, బట్టలు తదితర నిత్యావసరాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మండల కమిటీ అధ్యక్షుడు మచ్చ రఘు రామ్ మాట్లాడుతూ— “బాధిత గ్రామస్తుల పక్కన నిలబడటం ప్రతి ఒక్కరి బాధ్యత” అని తెలిపారు. కార్యక్రమంలో మండల ముదిరాజ్ సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.






