చెరుకు రైతుల వినతిమేరకు , తెరిపిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే DR భూపతి రెడ్డి*
NCSF సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వం తెరిపించి నడిపించాలని తేదీ 3-3-2024 న చెరుకు ఉత్పత్తి దారుల సంఘం ఆధ్వర్యంలో రూరల్ MLA DR R భూపతి రెడ్డి గారికి MLA క్యాంప్ ఆఫీస్ లో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా కన్వీనర్ బొడ్డు గంగారెడ్డి, AIKMS జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య గార్లు మాట్లాడుతూ సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీ నడిచిన కాలంలో వేలాది మంది రైతులకు, కార్మికులకు, వ్యవసాయం కూలీలకు ఉపాధి కల్పించి వారి బ్రతుకుల్లో ఆనందం నింపిందని ఆ కాలంలో రైతుల పిల్లల చదువులు, ఇండ్ల నిర్మాణం, పిల్లల పెండ్లిలు జరుపుకొని ఆనందంగ ఉన్నామని వారు అన్నారు. గత ప్రభుత్వల రైతు వ్యతిరేక విధానాలు, చక్కెర పాలసీలు, అవినీతి అధికారుల మూలంగా ఫ్యాక్టరీ మూలాన పడిందని, దాని ఫలితంగా రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు రోడ్డున పడ్డారని వారు అన్నారు. ఇప్పటికి ఈ ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న రైతులు చెరుకు పండించడానికి సిద్ధంగా ఉన్నారని. ఫ్యాక్టరీ తెరిపిస్తే వేలాది మందికి ఉపాధి లభిస్తుంది అని వారు అన్నారు. అనంతరం MLA DR భూపతి రెడ్డి గారు మాట్లాడుతూ చెరుకు ఫ్యాక్టరీలను తెరిపించటానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది అని, అందుకే దీనిపై సబ్ కమిటీ వేసిందని, బోధన్ NSF షుగర్ ఫ్యాక్టరీ తో పాటు NCSF సారంగాపూర్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించేదుకు సానుకూలంగా ఉందని అయన అన్నారు. ఇటీవల సబ్ కమిటీ చైర్మన్, పరిశ్రమల శాఖ మాత్యులు D శ్రీధర్ బాబు గారు ఫ్యాక్టరిలా సందర్శనకు వచ్చిన సందర్భంలో NCSF సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీ పై తగిన రిపోర్టును ఆయనకు అందించాలని కలెక్టర్ గారిని ఆదేశించారని తెలిపారు. త్వరలోనే కలెక్టర్ గారు నేను (MLA) ఫ్యాక్టరీని సందర్శిస్తామని ఫ్యాక్టరీ తెరిపించేందుకు ప్రభుత్వం తో మాట్లాడుతున్నానని అయన అన్నారు.
ఈ కార్యక్రమం లో చెరుకు ఉత్పత్తి సంఘం నాయకులు మచ్చర్ల నాగయ్య, R పృథ్వి రాజ్, S రాధాకిషన్ గౌడ్, D సాయరెడ్డి, కృష్ణ గౌడ్, B దేవస్వామి తదితరులు పాల్గొన్నారు
నిజాం షుగర్ కర్మాగారన్ని తెరిపించాలని రూరల్ ఎమ్మెల్యే భూపతి రేడ్డి కి వినతి పత్రం అందించిన రైతులు – A9 News
blmoticktn http://www.g2h8j0ntum6j5tx880380v917c3mnsm3s.org/
[url=http://www.g2h8j0ntum6j5tx880380v917c3mnsm3s.org/]ublmoticktn[/url]
ablmoticktn