ధరణి‌పై విచారణ ప్రారంభం – అక్రమ భూకబ్జాలపై రేవంత్ ప్రభుత్వం దృష్టి…..

On: Monday, August 18, 2025 5:40 PM

 

హైదరాబాద్ | ఆగస్టు 18:

తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, కార్ రేసింగ్ స్కాంల తర్వాత ఇప్పుడు ధరణి పోర్టల్ పై ప్రభుత్వం విచారణ ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇది మరో కీలక ఆయుధంగా మారనుంది.

ప్రభుత్వ వర్గాల ప్రకారం, గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ద్వారా వేల కోట్ల రూపాయల విలువైన భూములు బినామీల పేర్లపై మార్చినట్లు ఆధారాలు లభించినట్లు సమాచారం. ముఖ్యంగా సోమేష్ కుమార్ అధ్వర్యంలో ఈ స్కాం చోటుచేసుకున్నట్లు పేర్కొనబడుతోంది.

ధరణి ద్వారా పాత భూ రికార్డులను తొలగించి, విలువైన భూములను బినామీలకు కట్టబెట్టినట్లు, ఇప్పటికే రెవెన్యూ శాఖ కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, జంట నగరాల్లోని ప్రభుత్వ భూములు, ఎస్సెండ్ భూములు, ఎండోమెంట్, కరీజ్ ఖాతా భూములు, పాకిస్తాన్ వెళ్లిపోయిన కాంధశికుల భూములు సహా అనేక ప్రభుత్వ భూములు బినామీ పేర్లపై మార్చి, కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మించారని ఆరోపణలు వెలుగుచూస్తున్నాయి.

ఈ క్రమంలో, కేఆర్‌ఎస్ రింగ్ రోడ్ చుట్టూ, హైదరాబాద్ పరిధిలోని కీలక భూములు ఏయే మార్పుల పాలయ్యాయన్నదిపై కూడా ప్రభుత్వం విచారణ చేపట్టనుంది. ఇప్పటికే కొద్ది నెలలుగా కొన్ని గోప్యంగా రెవెన్యూ ఉద్యోగుల ద్వారా ఆధారాలు సేకరించబడినట్లు సమాచారం.

రైతుల భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇటీవల రెవెన్యూ సదస్సుల్లో సీఎం ప్రకటించిన నేపథ్యంలో, ఇప్పుడు మొదటిగా ప్రభుత్వ భూములు ఆక్రమించిన వ్యక్తులపై చర్యలు ప్రారంభించనున్నట్లు అధికారులు సంకేతాలు ఇస్తున్నారు.

18 Aug 2025

Leave a Comment