బాలుర జట్టు తృతీయ స్థానం
ఆదిలాబాద్ | ఆగస్టు 18:
అదిలాబాద్ జిల్లాలో జరిగిన 5వ తెలంగాణ సీనియర్ బేస్ బాల్ మహిళల మరియు పురుషుల రాష్ట్రస్థాయి పోటీల్లో, నిజామాబాద్ మహిళల జట్టు ప్రథమ స్థానాన్ని, పురుషుల (బాలుర) జట్టు తృతీయ స్థానాన్ని సాధించింది.
వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్‌ను పూర్తిగా నిర్వహించలేకపోవడం వల్ల, నిజామాబాద్ మరియు హైదరాబాద్ మహిళల జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. విజేత జట్లకు బహుమతులను తెలంగాణ బేస్ బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్వేతా గారు, ట్రెజరర్ డాక్టర్ కె. కృష్ణ గారు అందజేశారు.
ఈ సందర్భంగా TSWRIS సుద్ధపల్లి స్కూల్‌కు చెందిన లిఖిత “బెస్ట్ క్యాచర్” అవార్డును పొందింది. ఆమెను కూడా శ్వేతా మేడం ప్రత్యేకంగా అభినందించారు.
ఈ విజయాల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్. మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సొప్పరి వినోద్, వాలీబాల్, సాఫ్ట్ బాల్ అసోసియేషన్ల అధ్యక్ష కార్యదర్శులు హన్మంత్ రెడ్డి, మల్లేశ్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, గంగామోహన్, TSWRIS స్పోర్ట్స్ కోఆర్డినేటర్ రాజా రెడ్డి, జాయింట్ సెక్రెటరీలు సుజాత, నవీన్, జోష్ణ, నర్మద మరియు కోచ్‌లు నరేష్, మౌనిక, అనికేత్ లు విజేత క్రీడాకారులను అభినందించారు.