ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అదనపు కలెక్టర్ నగేష్.
ఎ9 న్యూస్, మెదక్ ,ఆగస్టు 18 :
పీడితులు, బహుజనులు ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన సామాన్యుడు, గొప్ప బహుజన విప్లవకారుడు, ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ టెంపుల్ వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి అదనపు కలెక్టర్ నగేష్ , గౌడ సంఘం నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుల, మత, జాతి వర్గ విభేదాలు లేని సమాజం కోసం దాదాపు 350 ఏండ్ల కిందనే కృషి చేసిన బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని, కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఏ బి సి డి ఓ గంగా కృష్ణ, గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు రమేష్ గౌడ్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు మెట్టు గంగారం, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ శ్రీనివాస్ ప్రణయ్ మహేందర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.