కామారెడ్డి A9 న్యూస్:
ఈ నెల 27వ తేదీన కామారెడ్డి జిల్లా నుండి కరీంనగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఉగ్రవాయి వాగు వద్ద ప్రమాదానికి గురైంది జరిగిన సంఘటన గురించి ఆర్టీసీ డ్రైవర్ యాదగిరి నీ వివరణ కోరగా మాట్లాడుతూ ఇది గత 20 సంవత్సరాలుగా నేను డ్రైవర్ గా ఉన్నాను నేను కనుక ఆ సమయంలో వాహనమును అదుపు చేయకపోతే చాలా పెద్ద ప్రమాదం జరిగేది.
నాకు ఇది మొదటిసారి జరిగినటు వంటి సంఘటన, నాకు ఆ క్షణాన లారీ డ్రైవర్ పూర్తిగా నా దారిలో నుంచి రావడం నేను నాకున్న నైపుణ్యంతో ఒకపక్క చూస్తే పెద్ద కందకం ఇంకొంచెం ముందుకెళ్తే బ్రిడ్జి అదే కామారెడ్డి వాగు, కేవలం 5 సెకండ్ల వ్యవధి గనక బస్సు మొత్తం కూడా వాగులో పడిపోయేది అప్పుడు అందరం ఏమైపోతుంటే అంత స్పీడ్ తో లారీ డ్రైవర్ నన్ను గుద్దడం చూసి నేను చనిపోయాను అనుకున్నారు ఆ 45 అడుగుల లోతుగా ఉన్నటువంటి బ్రిడ్జిలో బడితే మాత్రం అందరం కూడా కచ్చితంగా చనిపోయే వాళ్ళం అన్నారు.
తన ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 35 మంది ప్రయాణికులను కాపాడిన ఆర్టీసీ డ్రైవర్ యాదగిరిని ఆర్టీసీ అధికారులు సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆర్ఎం జానీ రెడ్డి కామారెడ్డి ఆర్టీసీ డిఎం ఇందర మరియు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.