నిజామాబాద్ జిల్లా A9న్యూస్ :
నిజామాబాద్ జిల్లా అర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి రైల్వే బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎంపీ అరవింద్ అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. టిఆర్ఎస్ ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టు పనుల్లో నాణ్యత లోపం పనుల డొల్లతనం బయటపడిందన్న ఎంపీ. వేల కోట్ల రూపాయలు కమిషన్లకు కకృతి పడ్డారని ఆరోపించారు. మామిడిపల్లి ఆర్ఓబి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పనులకు కేంద్రం 15 కోట్లు నిధులు మంజూరు చేస్తే దుర్వినియోగం చేసి పక్కదారి పట్టించారన్నారు. హిందువులపై కామెంట్లు చేసిన కల్వకుంట్ల కుటుంబాన్ని పరోక్షంగా కేటీఆర్ ను ఉద్దేశించి అయోధ్య నిర్మాణం కోసం వేచి చూసేలా తల పొగరు దించామన్నారు. నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుండి ప్రధాని పోటీ చేస్తే ఘనంగా ఆహ్వానిస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ తో బిజెపి పార్టీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్న ఎంపీ. మామిడిపల్లి బ్రిడ్జి నిర్మాణ పనులు రెండు నెలల్లో పూర్తి చేసే విధంగా అధికారులను ఆదేశించిన ఎంపి అరవింద్.