నిజామాబాద్ A9 న్యూస్:
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి త్వరలో 2000 కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు ప్రారంభిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్ లో ఉచిత బస్సు ప్రయాణ పథకం గురించి బస్టాండ్ ప్రాంగణంలోని మహిళలను అడిగి తెలుసుకున్న పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ ఆస్తులు తెలంగాణ ప్రజల ఆస్తులు అన్నారు. ఆర్టీసీ స్థలాలపై కన్నేస్తే చట్టారీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో లీజులకు ఇచ్చిన ఆర్టీసీ స్థలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రివ్యూ చేస్తామన్నారు. ఆర్టీసీ స్థలాల లీజుల కేటాయింపులో అక్రమాలు జరిగినట్లు తేలితే ఆ స్థలాలను కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తిరిగి ఆర్టీసీకి అప్పగిస్తుంది అన్నారు.