ప్రజలు రోడ్లపైకి రావొద్దని హైడ్రా హెచ్చరికలు.
హైదరాబాద్:
హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తుతోంది. శుక్రవారం మధ్యాహ్నం నుండి కుండపోత వర్షం కురుస్తుండటంతో నగర రహదారులన్నీ జలమయంగా మారాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, షేక్‌పేట్, మణికొండ, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో వర్షం మరింత ఉధృతంగా కొనసాగుతోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్ ప్రాంతంలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది.
ఈ నేపథ్యంలో హైడ్రా (HYDRA – Hyderabad Disaster Response Authority) అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరో రెండు గంటలపాటు భారీ వర్షం కురిసే అవకాశముందని, ప్రజలు అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావొద్దని సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచిస్తున్నారు.