రేపు సిట్ ముందుకు బండి సంజయ్.. ఫోన్ ట్యాపింగ్‌ కేసులో విచారణ…

On: Friday, August 8, 2025 11:48 AM

 

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్‌ కేసులో ఇప్పటికే పలువురు నేతలను విచారించిన సిట్‌ వారి నుంచి వాంగ్మూలాలను సేకరించిన విషయం తెలిసిందే.. అయితే తాజాగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను సిట్‌ విచారించనుంది.

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను రేపు సిట్ అధికారులు విచారించనున్నారు. అనంతరం ఆయన వాంగ్మూలాన్ని సిట్ రికార్టు చేయనుంది. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ విచారణపై ఇవాళ(గురువారం) కేంద్ర హోం శాఖ అధికారులు ఆయనతో భేటీ అయ్యారు. కేంద్ర హోం శాఖ అధికారులు ఫోన్ ట్యాపింగ్ విచారణపై ఆయనతో చర్చింస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీలో మాజీ పోలీస్ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నట్లు సమాచారం.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందన్న ఆరోపణలపై సిట్ విచారణ కొనసాగుతుంది. అయితే గతంలో తన ఫోన్, బంధువుల ఫోన్‌లు ట్యాప్ చేయబడ్డాయని బండి సంజయ్ ఆరోపించారు. ఇప్పటికే పలువురిని విచారించిన సిట్ ఆయన చేసిన ఆరోపణలపై బండి సంజయ్‌‌ను విచారించనుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఉన్న విషయం తెలిసిందే..

08 Aug 2025

Leave a Comment