కామారెడ్డి A9 న్యూస్: 

సదాశివ నగర్ మండలంలోని సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల మర్కల్ యందు మానసిక ఆరోగ్య అవగాహన శిబిరం లో భాగంగా కామారెడ్డి జిల్లా ఆసుపత్రి నుండి డాక్టర్ రమణ ఎండి సైకియాట్రీ ఆధ్వర్యంలో మానసిక ఆరోగ్య అవగాహన శిబిరం నిర్వహించడం జరిగింది.
ఈ కార్య్రమానికి మానసిక వైద్య నిపుణులు డా.జీ.రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థుల నుద్దేశించి మానసిక సమస్యల పై అవగాహన కల్పించారు. రోజు వారీ దినచర్య, పరీక్షా ప్రణాళికనుగుణంగా చదువుకోవటంలో మార్పులు, పరీక్షా సమయంలో ఒత్తిడి కి గురికావడం, పరీక్షల్లో ఫెయిల్ అయ్యినప్పుడు ఆత్మహత్య ప్రేరేపిత ఆలోచనలు అధిగమించాల్సిన తీరు, ఒంటరితనం లేకుండా ఉండటానికి, భ్రమల్లో గడపకుండా ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు ఊహించుకోవడం లాంటి విషయాలపై కూలంకుషంగా గా వివరించారు. ఈ కార్యక్రమం లో కళాశాల హెల్త్ సూపర్విజర్ డాక్టర్ హరిణి, వైస్ ప్రిన్సిపాల్ వి. రేణుక ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి సి.అనిత, అధ్యాపకులు మరియు విద్యార్థినీలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *