– సీఎం కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి….
గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల
చిరకాల కల నెలవేరిన వేల,
సంబరాలు జరుపుకున్న విద్యార్థులు, నిజామాబాద్ జిల్లాలో 30 సంవత్సరాల చిరకాల కల ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలకు తరగతులు అనుమతి రావడం, ఈ సంవత్సరం 2025-2026 నుండే తరగతులు ప్రారంభమవుతాయని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి తెలిపారు.తెలంగాణ యూనివర్సిటీ లో ఇంజనీరింగ్ కళాశాలఏర్పాటు కోసం కృషి చేసినటువంటి తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి , ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ,సీనియర్ కాంగ్రెస్ నాయకులందరికి,తన తరఫున సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సంవత్సరం నుండి ఇంజనీరింగ్ కళాశాలలో ఉత్తర తెలంగాణ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల
ఉపయోగకరంగా ఉంటుందని గుర్తించి ఏళ్ల తరబడి విద్యార్థులు డిమాండ్ చేస్తున్న అంశాన్ని రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి గత అసెంబ్లీ సమావేశాలలో ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. రూరల్ ఎమ్మెల్యే కృషి వల్ల నేడు తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.ఈ కళాశాలలో నాలుగు కోర్సులతో మంజూరు చేసినట్లు ఉన్నత విద్యాశాఖ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు అసెంబ్లీలో ప్రస్థావించిన అంశానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల లో 2025-26 అకాడమిక్ ఇయర్ నుండి తరగతులు ప్రారంభం అవుతున్నాయని తెలిపారు. యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో వివిధ రకాల కోట్స్ కోర్సులను ప్రవేశ పెడుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం బీటెక్ లో సీఎస్సీ, ఆర్టీఫిషియల్ ఇంటలిజన్స్ , కంప్యూటర్ సైన్స్అండ్ ఐటి, డాటా సైన్స్ కోర్సులలో ఒక్కొక్క కోర్సుకు 60 సీట్లు ఉండగా,మొత్తం 240 సీట్లు ఉన్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజ్ లో హాస్టల్ వసతి సదుపాయం ఉందని తెలిపారు . ఉత్తర తెలంగాణ విద్యార్థిని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సధ్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.