నిజామాబాద్ A9 న్యూస్:
*సుదీర్ఘ పరిపాలన, సుపరి పాలన కావాలంటే కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించండి….
*ఆర్మూర్ లో కాంగ్రెస్ పార్టీ జోరు…
*ప్రతి గృహానికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ….
*బిఆర్ఎస్, బిజెపి రెండు పార్టీలు ఒకటే…..
*ఆర్మూర్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఖాయం…
*కాంగ్రెస్ వైపే ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు..
*ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు…
*ఆసరా పింఛన్లు 4000 రూపాయలకు పెంపు…
*పేదలకు ఇందిరమ్మ ఇండ్లు…
*మంగళ హారతులతో, పూలవర్షంతో ఘన స్వాగతం పలికిన ఆర్మూర్ పట్టణ మహిళలు ప్రజలు…
ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్, టీచర్స్ కాలనీ, కమల నెహ్రూ కాలనీ ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున మంగళహారతిలో పూల వర్షంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా లలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కబ్జాల, కమిషన్ దారులకు, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గుణవంతులకు జరుగుతున్న ఎన్నికలు అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను గుర్తుంచుకొని , కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా ప్రతి ఒక్కరు హస్తం గుర్తుకు ఓటు వేయాలని అన్నారు.
ఆర్మూర్ నియోజకవర్గంలో ఇద్దరు ధనవంతులకు, ఒక గుణవంతుడికి జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజలు గుణవంతుడు వైపే ఉన్నారని ఆయన అన్నారు.బి ఆర్ ఎస్,బీజేపీ రెండు పార్టీలు ఒకటేనని, ఈ రెండు పార్టీలకు ఓటు వేస్తే ప్రజలు మోసపోతారని, మీ ఇండ్లు మీ ప్లాట్లు, మీ భూములు కబ్జా చేస్తారని ఆయన అన్నారు. సుదీర్ఘ పరిపాలన, సుపరి పరిపాలన కావాలంటే కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.
కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్లో భారీ మెజార్టీతో, ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని ఆయన అన్నారు. ఆర్మూర్ లో ఎక్కడికి వెళ్ళిన పెద్ద ఎత్తున మహిళలు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారని , మేము కాంగ్రెస్ పార్టీ వైపే అని చెప్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే ఒక్క పని చేయలేదని, ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా కట్టించలేదని, ఇటువంటి ఎమ్మెల్యేను ప్రజలు నాలుగు రోజుల్లో తరిమి కొట్టే సమయం ఆసన్నమైందని అన్నారు.
ఆర్మూర్ నియోజకవర్గ అన్ని సామాజిక వర్గాలు కాంగ్రెస్ వైపే ఉన్నాయని, హస్తాం గుర్తుకు ఓటేసి వారి మెజార్టీతో గెలిపిస్తామని వారు చెపుతున్నారని అన్నారు. తెలంగాణలో డిసెంబర్ మూడో తారీఖున కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను 60 రోజుల్లో తప్పక అమలు చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే మా మేనిఫెస్టోలో నిరుద్యోగుల కోసం ఉద్యోగ నోటిఫికేషన్ల తేదీలను కూడా ప్రకటించామని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు మొదటిది మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ప్రతి నెల 2500 రూపాయలు, 500 కి గ్యాస్ సిలిండర్, ప్రతి మహిళకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అన్నారు. గృహలక్ష్మి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని అన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, 5 లక్షల రూపాయలు, స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామని తెలిపారు. రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా 15000 రైతులకు, కౌలు రైతులకు ఇస్తామని, అలాగే వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000, అలాగే వరి పంటకు 500 బోనస్ ఇస్తామని తెలిపారు,
చేయూత పథకం కింద 57 సంవత్సరాలు నిండిన, అర్హత ఉన్న వృద్ధులు అందరికీ నెలవారి పింఛన్ 4000 రూపాయలు ఇస్తామని, అలాగే రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా కింద పది లక్షల రూపాయలు ఇస్తామని, ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఎక్కడైనా ఏ హాస్పిటల్ అయినా వెళ్లొచ్చని అన్నారు.
యువ వికాసం పథకం కింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇస్తామని ఆయన అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మహిళలు ప్రజల తదితరు పాల్గొన్నారు.