నిజామాబాద్ A9 న్యూస్:
*ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ దాఖలు
*మాజీ మంత్రి శనిగరం సంతోష్ రెడ్డి తో కలిసి నామినేషన్ దాఖలు
*సుమారు 80వేల మందితో భారీ ర్యాలీ.
*100% జీవన్ రెడ్డికి ప్రత్యర్థిని నేనే.
*50వేల మెజారిటీతో తనను గెలిపించాలని కోరిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి.
*అధికారం ఉందని జీవన్ రెడ్డి నన్ను చాలా వేధించాడు.
*ర్యాలీ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టిన కాంగ్రెస్ అభ్యర్థి.
*చేతు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
*పదేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు.
*జీవన్ రెడ్డిని ఓడించండి..
*భావోద్వేగంగా ప్రసంగించిన కాంగ్రెస్ అభ్యర్థి.
*కాంగ్రెస్ శ్రేణులను కదిలించిన ప్రసంగం..
ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్మూర్ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్ కు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్కు ముందు ఆర్మూర్ మునిసిపల్ పట్టణంలోని పెర్కిట్ నుంచి మామిడి పల్లి చౌరస్తా మీదుగా ఆర్మూర్ నియోజకవర్గం మహిళలు, పురుషులు, యువకులు దాదాపు 80వేల మందితో భారీ ర్యాలీతో నామినేషన్ వేయడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఓపెన్ టాప్ జీపులో తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలను, కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నందున చేతు గుర్తుకు ఓటు వేసి 50వేల భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పది సంవత్సరాలలో ఆర్మూర్ ప్రాంతంలో కక్షపూరిత రాజకీయాలు, అక్రమ కేసులు బనాయించారన్నారు. ఇలాంటి రాజకీయాలకు చమర గీతం పాడడానికి చేతు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. తనను గెలిపిస్తే జీవన్ రెడ్డికి రాబోయే రోజులలో తగిన గుణపాఠం నేర్పిస్తానన్నారు.
పదేళ్లలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు ఒకసారి ఆశీర్వదించి, మీలో ఒకడిగానున్న నన్ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలందరికీ 2,500రూపాయలు, ఇళ్ల స్థలాలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ప్రతినెల రూ.4 వేల పించన్ ఇస్తామన్నారు.
ఆర్మూర్ నియోజకవర్గ బిఅర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనను అనేక విధాలుగా చాలా వేధింపులకు గురి చేశాడని పేర్కొంటూ భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. ప్రసంగంలో వినయ్ రెడ్డి కన్నీరు పెట్టుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తామంతా అండగా ఉంటామని మేము ఉన్నామని నినాదాలు చేశారు. ఆర్మూర్ లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన స్వంత ఇల్లుని ఖాళీ చెయించాడని వినయ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులు జీవన్ రెడ్డి, తను ఒకటే అని దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రజలు పుకార్లను నమ్మొదని అన్నారు.
తనను మోసం చేసిన జీవన్ రెడ్డినీ ఎప్పటికీ వదలనని, జీవన్ రెడ్డికి 38 కోట్లకు అమ్ముడుపోయానని అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తున్న నాయకులకు సవాల్ విసిరారు. నవనాథ సిద్దుల గుట్ట పైకి పచ్చి బట్టలతో వెళ్దామని సవాలు విసిరారు. అన్నట్లుగానే నామినేషన్ అనంతరం సిద్దుల గుట్టపైకి పచ్చిబట్టలతో ఎక్కి శివాలయం లోని శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తాను డబ్బులకు అమ్ముడు పోలేదని, జీవన్ రెడ్డి నేను ఒకటి కాదని నిరూపించుకున్నారు. ఆర్మూర్ లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా తిరిగితే కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు. ఒక్కసారి తనకు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే కేసులు పెట్టిన వారిపై నుండి కేసులు ఎత్తివేస్తానన్నారు.
మీ అందరికీ నేను అండగా ఉంటానని ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు వాగ్దానం చేశారు. ఈ సభలో మాజీ మంత్రి శనిగారం సంతోష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రమేష్ రెడ్డి, మహేందర్ రెడ్డి, మార చంద్రమోహన్ రెడ్డి, యాళ్ల సాయి రెడ్డి, గొర్త రాజేందర్, ఫతేపూర్ పోచన్న, సాయిబాబా గౌడ్, కోల వెంకటేష్, విట్టం జీవన్, ఆలూరు విజయ్, మంద మహిపాల్, ఫతేపూర్ ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.