Jul 26, 2025:
తెలంగాణ : ఇంజినీరింగ్, వృత్తి విద్య కాలేజీల్లో ఫీజుల నిర్ధారణకు రివైజ్డ్ గైడ్ లైన్స్ కోసం జి.బాలకృష్ణ అధ్యక్షతన ప్రభుత్వం అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. సభ్యులుగా శ్రీదేవసే, క్షితిజ, వెంకటేశ్వరరావు, దేవేందర్ రెడ్డి, శ్రీరామ్ వెంకటేశ్, కె.వెంకటేశ్వరరావు, క్రిష్ణయ్యతో పాటు కమిటీ చైర్మన్ కోరుకున్న విధంగా మరో ఇద్దరితో కూడిన కమిటిని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇతర రాష్ట్రాల్లోని విధానాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.