గుంపులుగా తిరుగుతున్న వీధి కుక్కలు – పట్టించుకోని అధికారులు..

On: Saturday, July 26, 2025 6:27 AM

A9 న్యూస్ డెస్క్:

ఆర్మూర్ పట్టణంలో వీధి కుక్కల సంచారం తీవ్ర సమస్యగా మారింది. ప్రధాన రహదారులపై గుంపులుగా తిరుగుతున్న వీధి కుక్కలు వాహనదారులు, పాదచారులను కూడా భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. పాఠశాలలకు వెళ్తున్న చిన్నారులు, వృద్ధులు వీటి కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇటీవలి కాలంలో కుక్కలు వెంటపడటం, దాడి చేయడం వంటి ఘటనలు పెరుగుతున్నప్పటికీ పట్టణ మున్సిపల్ అధికారులు ఈ అంశాన్ని గమనించకుండా విస్మరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వీధి కుక్కలు పిల్లలు మీద దాడి చేసిన ఉదంతాలు కూడా వెలుగులోకి వచ్చాయి.

ప్రజలు దీనిపై అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ, గట్టి చర్యలు తీసుకోలేదని వారు వాపోతున్నారు. పట్టణంలోని కుక్కల గుంపులు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి. పట్టణ ప్రజలు మున్సిపల్ అధికారులను తక్షణమే చొరవ తీసుకొని వీధి కుక్కల సమస్యకు పరిష్కారం చూపాలని, పట్టణంలోని ప్రజలకు భద్రత కల్పించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరుచుకొని తమ విధులను నిర్వర్తించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

27 Jul 2025

Leave a Comment