A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
భారతీయ జనతా పార్టీ ఆలూర్ మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించబడిన స్థానిక సంస్థల ఎన్నికల మండల కార్యశాల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి వినతిపత్రం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎమ్మెల్యేని కలిసి నిజామాబాద్ నుండి ఆర్మూర్ వరకు మరియు నిజామాబాద్ నుండి నందిపేట్ వరకు బస్సు మార్గాన్ని మా గ్రామం మీదుగా ఏర్పాటు చేయాలి అని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఆలూర్ మండలం నుండి కల్లెడ మరియు చిన్నాపూర్ మీదుగా నేషనల్ హైవే 63 వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి శాసన సభ్యుని తలంపుతో ప్రభుత్వ నిధులు మంజూరు చేయాలని కోరారు.
అలాగే కల్లెడ గ్రామంలో సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థకు అవసరమైన నిధులను మంజూరు చేయాలి అనే అభ్యర్థనను కూడా ఎమ్మెల్యేకి వినతిపత్ర రూపంలో అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలూర్ మండల బిజెపి సీనియర్ నాయకులు గంగోల్ల ప్రళయతేజ్ పాల్గొన్నారు.