శ్రావణ మాసం శుభారంభం-  మచ్చర్లలో చౌడేశ్వరి అమ్మవారికి భక్తి పూజలు …

On: Saturday, July 26, 2025 5:44 AM

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా మచ్చర్ల గ్రామంలో ఓం శ్రీ చౌడేశ్వరి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. భండారి అభిషేకం, జలాలతో అభిషేకం చేశారు. అష్టోత్తర నామ కుంకుమ అర్చన వాయినం తాంబూలాలతో గ్రామ మహిళలు సామూహికంగా కైంకర్యం చేశరు.

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య చిన్నయ్య స్వామి (తల్వేద మఠాధిపతి గురువు చిన్న కుమారుడు) శ్రావణ మాస విశిష్టతను భక్తులకు వివరించారు. శ్రావణ మాసంలోని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను తెలుపుతూ పూజా విధానాలను తెలియజేశారు.

అలాగే ఆలయ కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రాఖీపూర్ణిమ సందర్భంగా కాడా దీపోత్సవం మరియు కుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ ఉత్సవానికి గ్రామ ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

27 Jul 2025

Leave a Comment