A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:
నిజామాబాద్ బాధిత మహిళలకు మరియ పిల్లలకు సహయం మెరుగైన సేవలు అందిస్తూ భరోసా కేంద్రం అండగా నిలుస్తుంది ఇందులో భాగంగా శుక్రవారం నిజామాబాద్ పోలీస్ కార్యాలయంలో భరోసా కేంద్రంలో నమోదైన పోక్సో మరియు రేప్ కేసులలో ఏడు మంది బాధిత పిల్లలకు మరియు మహిళలకు భరోసా కేంద్రంతరపున చెక్కులను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐ.పి.యస్. చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ భరోసా కేంద్రం ద్వారా మహిళలకు మనో-ధైర్యం, న్యాయం అందించడం పోలీస్ శాఖ యొక్క ముఖ్య లక్ష్యాలలో ఒకటి శుక్రవారం బాధిత మహిళలకు, పిల్లలకు ఆర్ధిక సాయం కోసం భరోసా కేంద్రం తరపున చెక్కులు అందజేయడం ద్వారా పునర్వాసానికి మనదైన తోడ్పాటు అందించినందుకు సంతృప్తిగా ఉంది ప్రతీ మహిళాలు, పిల్లలు భద్రతగా గౌరవంగా జీవించాలన్నదే మా అభిలాష భరోసా కేంద్రం సేవలను మరింత విస్తరించి బాధితుల కోసం ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) బస్వారెడ్డి, భరోసా సెంటర్ కో-ఆర్డినేటర్ జి.రోజా, లీగల్ అడ్వయిజర్ డయాణ గీతిక, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్.ఐ పుష్పావతి, మౌనిక, సవిత, ఎ.ఎన్.ఎమ్లు తదితరులు పాల్గొన్నారు.