ఏపీ సీఎం చంద్రబాబు ఎక్కడ మాట్లాడినా.. అమరావతి రాజధాని, సైబరాబాద్ వంటి కీలక ప్రాజెక్టులను ప్రస్తావిస్తున్న విషయం తెలిసిందే. ఆయన హయాంలోనే హైదరాబాద్‌లో ఐటీ కేంద్రాలకు నెలవుగా సైబరాబాద్ నిర్మాణం చేపట్టారు. భాగ్యనగరంలోనే కాదు. తెలంగాణలో కూడా ఇదొక రికార్డే. అంతేకాదు.. హైదరాబాద్‌కు అతి పెద్ద ఆదాయ వనరు కూడా. అక్కడితో కూడా హిస్టరీ ఆగదు. హైదరాబాద్, సికింద్రాబాద్ తర్వాత.. సైబరాబాద్ మూడో నగరంగా అభివృద్ధి చెందింది. సైబరాబాద్ నిర్మాణంతో చంద్రబాబుకు అంతర్జాతీయంగా ఖ్యాతి సొంతమైంది. ఇప్పుడు. దీనిని తలదన్నేలా.. చరిత్రలో తన పేరు కూడా ఉండిపోయేలా రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆయన ‘ఫ్యూచర్ సిటీ’ పేరుతో అత్యాధునిక సౌకర్యాలతో అతి పెద్ద నగరాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీనిని ఏపీ రాజధాని అమరావతితో అనుసంధానం చేయాలని కూడా తలపోస్తున్నారు. మెట్రో సహా. హైస్పీడ్ రైలు, గ్రీన్ కారిడార్ ద్వారా రహదారులను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అయితే.. దీనిని నిర్మించడం రాష్ట్ర సర్కారు వల్లే కాదు. కేంద్రం సహకారం ముఖ్యం. అందుకే. ఇటీవల కాలంలో ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీ. కేంద్ర మంత్రులను కలుసుకుని.. ఈ ప్రాజెక్టును వివరిస్తున్నారు. సైబరాబాద్‌ను మించిన తరహాలో దీనిని రూపొందిస్తున్నామని చెబుతున్నారు. తద్వారా.. రేవంత్ తనపేరు శాస్వతంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
*ఏంటీ ఫ్యూచర్ సిటీ.?
భవిష్యత్తులో పట్టణ వాతావరణాల దృష్టి, మిడిల్ స్కూల్ విద్యార్థుల అవసరాలు, మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి వారి అవ సరాలను దృష్టిలో పెట్టుకుని ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. హైబ్రీడ్ నగరాలను రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు. భవిష్యత్ నగరాల విస్తృత భావన పట్టణీకరణ, సాంకేతికత, సామాజిక అవసరాలతో ఏర్పడి ఉన్నాయి. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి వాటికి ప్రాధాన్యంఇస్తూ.. ఫ్యూచర్ సిటీకి రూపకల్పన చేస్తున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ రహదారుల మధ్య 30,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ ను చేపట్టాలన్నది సీఎం రేవంత్ ఆలోచన. ద్వారా పర్యావరణహిత పట్టణాన్ని సృష్టించాలనేది ఆయన వ్యూహం. దీనికి కేంద్రం చాలా వరకు తోడ్పాటును అందించాల్సి ఉంటుంది. ఇది కనుక సాకారం అయితే. తెలంగాణపై రేవంత్ వ్యక్తిగత ముద్ర స్పష్టంగా కనిపిస్తుందని నిఫుణులు చెబుతున్నారు.