ఒక్క ఏడాదిలో రూ.22,845 కోట్లు కొట్టేసిన సైబర్‌ నేరగాళ్లు.

On: Wednesday, July 23, 2025 5:59 AM

 

Jul 23, 2025.

NCRP, CFCFRMS ప్రకారం గతేడాది(2024) కాలంలో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి రూ.22,845.73 కోట్లను సైబర్‌ నేరగాళ్లు కొళ్లగొట్టారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ తెలిపారు. మంగళవారం లోక్‌సభలో ఆయన లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 2023తో పోలిస్తే ఈ మొత్తం దాదాపు 206 శాతం ఎక్కువని తెలిపారు. సైబర్‌ నేరాలకు సంబంధించి 2022లో 10,29,026 కేసులు, 2023లో 15,96,493, 2024లో 22,68,346 కేసులు నమోదయ్యాయని కేంద్రమంత్రి తెలిపారు.

23 Jul 2025

Leave a Comment