నిజామాబాద్ A9 న్యూస్:

తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు విజయోత్సవ సభను గురువారం సిఐటియు కార్యాలయంలో నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ సెక్టార్ లీడర్లతో జరిగిన సభలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జయలక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ అనేక దశల వారి ఆందోళనలు పోరాటాలు నిర్వహించి అంగన్వాడీ కార్యకర్తలు ఐక్యంగా సమ్మె నిర్వహించటం ద్వారా ప్రభుత్వం అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి అంగీకరించిందని ఇచ్చిన హామీలను వెంటనే అమలు జరపటానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని.

ఈ పోరాట విజయం అంగన్వాడీ కార్యకర్తల విజయమని ఆమె అన్నారు. 24 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా పోరాడి ప్రభుత్వం చేసే కుట్రలను తిప్పికొట్టిన అంగన్వాడీ కార్యకర్తలందరికీ ఆమె అభినందనలు తెలియజేశారు ఎప్పటికప్పుడు రాష్ట్ర కమిటీ చేసే సూచనలను అనుసరిస్తూ అంగన్వాడీ కార్యకర్తలు అందరూ వీరోచితంగా పోరాడటం మూలంగా ప్రభుత్వం స్పందించిందని భవిష్యత్తులో ఉద్యోగ భద్రతకు జోకులుగా గుర్తింపు పొందటానికి ఇదే ఐక్యత పోరాటాన్ని ప్రదర్శించాలని ఆమె పిలుపునిచ్చారు ఇటీవల కాలంలో సమ్మె పోరాటాల్లో ఉన్న సందర్భంలో ప్రభుత్వాలు స్పందించి పరిష్కారం చేసిన ఏకైక పోరాటం అంగన్వాడి పోరాటమని ఆమె అన్నారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కే దేవగన్, పి.స్వర్ణ, జిల్లా నాయకులు చంద్రకళ, రాజ సులోచన మంగాదేవి, శివరాజమ్మ, జిల్లా అధ్యక్షులు ఏ రమేష్ బాబు సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్ మరియు అంగన్వాడీ యూనియన్ నాయకులు జ్యోతి, గోదావరి, లావణ్య, ఎలిజబెత్ రాణి, సూర్య కళ, వాణి, జగదాంబ, అనంతలక్ష్మి, సునంద, తదితరులు పెద్ద ఎత్తున అంగన్వాడిలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *