*విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం రైతు మృతి
*లైన్ మెన్ విద్యుత్ అధికారులపై కేసు నమోదు..
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో రైతు మృత్యువాత పడ్డాడు పోలీసులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదర్ గూడ మండలంలోని గాలిగూడా గ్రామానికి చెందిన క్యాత్రమౌనీ నర్సింలు అదే గ్రామంలో కరెంటు సమస్య ఉండడంతో ఇద్దరు రైతులకు లైన్ మెన్ చెన్నయ్య ఎల్సి ఇచ్చారు ఓ రైతు పని ముగిసిన తర్వాత ఆ రైతు లైన్ మెన్ కు ఫోన్ చేసి చెప్పడంతో మరో రైతుకి ఇచ్చిన ఎల్సి గురించి మరిచి పోయినా లైన్ మెన్ సప్లై ఆన్ చెయ్యడంతో ఒక్కసారిగా విద్యుత్ స్తంభంపై ఉన్న రైతు నర్సింలు కరెంట్ షాక్ కు గురై విద్యుత్ స్తంభంపై నుండి కిందికి పడి మృత్యువాత పడ్డాడు దీంతో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే రైతు ప్రాణం పోయిందని గ్రామస్తులు లాల్ పహాడ్ చౌరస్తా దగ్గర ఆందోళన చేపట్టారు విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఇదే క్రమంలో జిల్లేడు చౌదర్ గూడా మండల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో లైన్ మెన్ తో పాటు విద్యుత్ అధికారిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు..