గవర్నర్ వస్తున్న సందర్భంగా PDSU నాయకుల ముందస్తు అరెస్ట్…

On: Wednesday, July 16, 2025 12:08 PM

గవర్నర్ వస్తున్న సందర్భంగా PDSU నాయకుల ముందస్తు అరెస్ట్…


తెలంగాణ యూనివర్సిటీనీ గవర్నర్ ప్రక్షాళన చేయాలి…

తెలంగాణ యూనివర్సిటీ కి గవర్నర్ గారు వస్తున్న సందర్భంగా నిజామాబాద్ నగరంలో పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్,జిల్లా నాయకులు నిఖిల్ ను ముందస్తుగా ఆఫీసుల వద్ద అరెస్టు చేసి పోలీస్ ఫోర్త్ టౌన్ కి తరలించడం జరిగింది .

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యూనివర్సిటీల చాన్సలర్ హోదాలో తెలంగాణ విశ్వవిద్యాలయానికి గవర్నర్ గారు వస్తున్న సందర్భంగా యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, ఇంజనీరింగ్ కోర్సులను తీసుకురావాలని,గర్ల్ హాస్టల్ నిర్మాణం మరియు మౌలిక సదుపాయాలు కల్పించాలని, నూతన యుజిసి ముసాయిదాను వెనక్కి తీసుకోవాలని, లక్షల రూపాయలు ఖర్చు చేసి తెలంగాణ వర్సిటీ స్నాతకోత్సవం కి యూనివర్సిటీ విద్యార్థులను పిలువకపోవడం సరైంది కాదని, అవినీతికి ఆస్కారం లేకుండా తెలంగాణ యూనివర్సిటీ ప్రక్షాళన చేయాలని యూనివర్సిటీలకు అధిక నిధులు కేటాయించే విధంగా గవర్నర్లు చొరచూపాలని అన్నారు. అక్రమ అరెస్టులను ఖండించాలన్నారు.
అరెస్ట్ అయిన వారిలో పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్,జిల్లా నాయకులు నిఖిల్ లు ఉన్నారు.

23 Jul 2025

Leave a Comment