JAKRANPALLY:
జక్రాన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో పుప్పాలపల్లి గ్రామంలో గల కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిసి గ్రామంలోని అభివృద్ధి పనుల గురించి చర్చించడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఊర్లో ఉన్నటువంటి శిథిలావస్థకు చేరిన హనుమాన్ మందిరం గురించి వారు చెప్పడం జరిగింది. దానికి ఎమ్మెల్యే భూపతిరెడ్డి సానుకూలంగా స్పందించి ఎండోమెంట్ కమిషనర్ గారితో మాట్లాడి హనుమాన్ టెంపుల్ సాంక్షన్ చేయించడం జరిగింది. అలాగే ఊర్లో శంకుస్థాపన చేసినటువంటి రోడ్డు పనులు కూడా ప్రారంభం అయ్యాయాని వారు ఎమ్మెల్యే తో చెప్పడం జరిగింది. గత పది సంవత్సరాల నుండి ఎటువంటి అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ హయాంలో ఇటువంటి ఎన్నో పథకాలు మా ఊరికి అందాయని వారు చెప్పుకొచ్చారు. అలాగే ఇందిరమ్మ ఇండ్లు కూడా అర్హులైన వారికి అందించామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో చింత నరసయ్య సాయి రెడ్డి, సత్తెన్న,రమణారెడ్డి, మరియు గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.