నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ మున్సిపాలిటీలో 24 అంశాలతో కూడిన బడ్జెట్ ను మున్సిపల్ సాధారణ సమావేశంలో ప్రవేశపెట్టగా 23 అంశాలతో కూడిన బడ్జెట్ ను మున్సిపల్ కౌన్సిలర్లు ఆమోదించారు. ఆర్మూర్ నియో జకవర్గంలోని ఆర్మూర్ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించారు.
సమావేశంలో ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నా, కమిషనర్ ప్రసాద్ చౌహన్, డిఈ భూమేశ్వర్, మున్సిపల్ కౌన్సిలర్లు గంగ మోహన్ చక్రు, కాందేష్ సంగీత శ్రీనివాస్.ఎస్. ఆర్. సుజాత రమేష్, రేవతి గంగా మోహన్, వరలక్షి లింబాద్రిగౌడ్, శంకర్, నరసింహారెడ్డి, లత రాజు రెడ్డి, సంగీత శ్రీనివాస్ పాల్గొన్నారు.